Inspirational Good Morning Quotes: శుభోదయం సందేశాలు తెలుగులో.. స్ఫూర్తి నింపే అద్భుతమైన కోట్స్..
ప్రతి ఉదయం, మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంది. పాజిటివ్ మైండ్సెట్ కలిగి రోజును ప్రారంభించండి, "శుభోదయం"
నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ పదికాలాలు, తోడు నడిస్తే అదే అనుబంధం, "శుభోదయం"
వేలాది మిత్రులను కలిగివుండటం అద్భుతం కాదు, వేల సమస్యలను తీర్చగల మిత్రుడిని కలిగి ఉండటం అద్భుతం, ఏ సమస్య మన దరికి రానీయని మిత్రుడుండటం ఇంకా అధ్బుతం, "శుభోదయం"
Good Morning Wishes in Telugu: ఉదయాన్నే మీకు ప్రేరణనిచ్చే కోట్స్
ఎవరితో మాట్లాడితే మీకు సంతోషం కలుగుతుందో, వారితో మాట్లాడండి, మీతో మాట్లాడితే ఎవరికైతే సంతోషం కలుగుతుందో, వారితో తప్పక మాట్లాడండి, "శుభోదయం"
మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పరవాలేదు కానీ, సోమరితనాన్ని దరి చేయనీయకండి, సోమరిపోతు దేన్నీ సాధించలేడు, "శుభోదయం"
పూసిన ప్రతి పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది కానీ, నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికి నిలిచే ఉటుంది, "శుభోదయం"
జీవితంలో నువ్వు ఎవరినైతే , ఎక్కువ ఇష్టపడతావో, వారివల్లే ఎక్కువ బాధ పడతావు, "శుభోదయం"
నీ చిరునవ్వు, ఈ పువ్వులా ఎల్లప్పుడూ వికసిస్తూ ఉండాలని, మనసారా కోరుకుంటూ, "శుభోదయం"
మనలోని స్వార్థం, గర్వం ఈ మంచుబిందువులా జారిపోవాలి, మంచితనం మాత్రము ఈ పువ్వులా వికసించాలని కోరుకుంటూ, "శుభోదయం"
ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు, ఒకటి మనశాంతి రెండు సంతృప్తి, ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు, "శుభోదయం"
ఎప్పుడూ నవ్వుతూనే ఉండు, అది ఎలా ఉండాలంటే నీ పెదవులపై చిరునవ్వుని చూసి ఎదురైన సమస్య కూడా చిన్నబోయేంతలా, "శుభోదయం"
ఆనందమంటే ఎక్కడో ఉండదు నీలో, నీ చుట్టూనే ఉంటుంది మనసుపెట్టి చూడాలంతే, "శుభోదయం"
సూర్యోదయం కూడా చిన్న కాంతితోనే మొదలవుతుంది, నీ ఎదుగుదల కూడా అంతే.. చిన్నగానే మొదలవ్వాలి, "శుభోదయం"
Good Morning Quotes in Telugu: ఉదయాన్నే స్ఫూర్తినిచ్చే సందేశాలు..
ఈరోజు మీరు అనుకున్నవి జరగాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ, "శుభోదయం"
Best Telugu Good Morning Quotes.. మీ రోజును ఉత్సాహంతో ప్రారంభించండి..
మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో క్లారిటీ ఉంటుంది ఆలోచన మంచిగా ఉంటే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది, "శుభోదయం"
వికసించే పుష్పంలా, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, "శుభోదయం"
పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా కొన్నాళ్లకు మరుగునపడిపోతుంది, అందుకే ఎంత బిజీగా ఉన్నా మన అనుకున్న వాళ్లను రోజుకొకసారైనా పలకరించండి, "శుభోదయం"
ప్రయత్నించడంలో ఎప్పుడూ నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే, అదే మీ విజయాన్ని మరింత దూరం చేస్తుంది శుభోదయం, "శుభోదయం"
ఈ ఉదయం మీ జీవితంలో వెలుగులు నింపాలని, ఇవాళ మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ, "శుభోదయం"
మనసులో బరువుని దింపగలిగే శక్తి నవ్వుకి మాత్రమే ఉంది, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి, "శుభోదయం"
అందర్నీ విమర్శించేవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు కానీ, ఇతరులను సరదాగా పలకరించేవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు శుభోదయం, "శుభోదయం"
అవివేకి ఎదుటి వారి పతనంలో తన విజయాన్ని వెతుక్కుంటే వివేకి తన పతనానికి, "శుభోదయం"