Broken Heart Sad Love Quotes in Telugu.. విరిగిన ప్రేమ బంధం: హృదయాన్ని కలచివేసే సూక్తులు..
"నిజమైన ప్రేమికులు ఒకరికొకరు దూరంగా ఉన్నా ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు"
"మనిషి విలువ తెలియని వాళ్లకు మనసిస్తే రోజు రోజుకి మన విలువ తగ్గిపోతుంది"
"ఏడవడం తప్పుకాదు కానీ, ఆ కన్నీళ్లు గుర్తించని, మనిషి విలువ తెలియని వాళ్ల కోసం ఏడవడం తప్పు"
"మనిషిని జీవితాంతం బందీగా ఉంచడానికి ప్రేమను మించిన ఆయుధం లేదు ఈ సృష్టిలో"
"నా మనసులో నీపై ఉన్నంత ప్రేమ నీ మనసులో నాపై లేనప్పుడు నేనెంత ప్రేమిస్తున్నా నీకు ఎప్పటికీ అర్థం కాదు"
"కలిసి నడవాల్సిన బంధంలో ఒకరితో ఒకరికి పోటీ ఎందుకో మరి లేని ప్రేమను ప్రదర్శించడానికా, లేక నీకంటే నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పడానికా"
"నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు నీకు సమాధానం చెప్పలేక కాదు మాట్లాడటానికి మనసురావడం లేదని"
"బంధం మనిషికి భరోసాగా ఉండాలే తప్ప అవసరానికి వాడుకునేదిగా ఉండకూడదు"
"గతం ఏమైనా, ఎలా ఉన్నా భవిష్యత్తులో నువ్వు నాతోనే ఉంటావనే ఆశతో ఎదురుచూస్తున్నా"
Love Failure Sad Love Quotation
"ఈ రోజుల్లో ఏ బంధమైనా పేరుకు మాత్రమే అన్నట్టు ఉంది మనస్ఫూర్తిగా కనిపించడం లేదు"
"మంచి సంబంధాలు గడియారంలో ముళ్ల వంటివి.. అవి అప్పుడప్పుడు మాత్రమే కలుస్తాయి కానీ, ఎప్పుడూ కరెక్ట్ గా ఉంటాయి"
"మోసం ఎప్పుడూ మంచి అనే ముసుగు వేసుకుని పరిచయం అవుతుంది దానిని గుర్తించే లోపు జీవితాన్నే నాశనం చేస్తుంది"
"మంచి వాళ్లకు మనసు మొదటి శత్రువు మొహమాటం రెండో శత్రువు"
"మన పరిచయం మరొకరికి ఇంతకాలం ఏమైపోయావు అనేలా ఉండాలే తప్ప.. అసలు ఎందుకు పరిచయమయ్యాం అనేలా ఉండకూడదు"
"కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యను మౌనంగా ఉంటూ మనమే వాటిని పెంచి పోషించుకుని బాధపడుతున్నాము"
"శవంగా మారిన తర్వాత బయటపడే ప్రేమాభిమానాలు ప్రాణం ఉన్నప్పుడు ఏమవుతాయో తెలియడం లేదు"
"మనకి ఎన్నో పరిచయాలు ఉన్నా కేవలం ఒకరి కోసమే మనసు ఆరాటపడుతుంది.. బహుశా ఇదేనేమో ప్రేమంటే"
"ఉన్నప్పుడు తెలుసుకోలేకపోతే వెళ్లిపోయాక వెతుక్కోవాల్సి వస్తుంది అది మనిషైనా, వస్తువైనా"
"ప్రతి నీటి బొట్టు విలువైనదే.. అది మేఘాల నుంచి వచ్చినా కంటి నుంచి వచ్చినా"
"మన ప్రేమ ప్రయాణంలో కలిసి ఉన్న రోజుల కన్నా తలచుకున్న రోజులే ఎక్కువ"
"నీ చెంత లేనిది నేను మాత్రమే నా ఆలోచనలు, ఆశలు నిత్యం నీతోనే, నీలోనే ఉంటాయి"