50+ Motivational Quotes for Success in Life | మీ జీవిత విజయానికి ఉత్తమ కోట్స్..
విప్లవం మానవజాతి యొక్క అసమర్థమైన హక్కు, స్వాతంత్య్రం అనేది అందరికీ ఒక శాశ్వత జన్మహక్కు, శ్రమించేవాడు సమాజానికి నిజమైన సంరక్షకుడు.
కొందరిని ఏం చేసినా మెప్పించలేం, కొందరి నుంచి ఏం చేసినా తప్పించుకోలేం.
వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతాడు, చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే మిగిలిపోతాడు.
మనం రాసే అక్షరాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవడం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పయితే తిరిగి రావడం అంత ఈజీ కాదు.
జీవితంలో గెలవాలంటే సింహంలా ధైర్యంగా పరిగెట్టడమే కాదు, జింకలా చాకచక్యంగా తప్పించుకునే నేర్పరితనం కూడా ఉండాలి.
చేతివేళ్లన్నీ ఒకే పొడవులో ఉండవు కానీ, మడిచినప్పుడు అన్నీ సమానం అవుతాయి, అలాగే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సులభం, సుఖమయం అవుతుంది.
జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేదీ కాదు, రాసేవాడు పైన ఉన్నాడు,రంగస్థలంలో నీవు, నేను, అందరం పాత్రధారులం మాత్రమే, నటించే వాళ్ళు మనతో ఉన్నారు.
గోర్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం, అంతేకానీ వేళ్లను కత్తిరించం కదా, అలానే మనస్పర్ధలు వచ్చినప్పుడు, కోపతాపాలను కత్తిరించాలి కానీ, బంధాలను కాదు.
నిన్ను ఇష్టపడే వారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరమైపోతారు, అలాంటి వాళ్ల గురించి ఆలోచించి,నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది.
వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే, జీవితంలో మిగిలేది విషాదమే.
సున్నితమైన మనసు ఉన్న వారు తనకు తామే శత్రువు, వారికి మోసం చేసేంత తెలివి లేదు,మర్చిపోయేంత బలం లేదు, అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు.
మిమ్మల్ని మీరు ఎవరితోనో పోల్చుకుని తక్కువ చేసుకోకండి, ఎవడి గొప్పతనం వాడిది.మీరు ఎవరికన్నా తక్కువా కాదు, ఎవరో మీకన్నా ఎక్కువా కాదు.
సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు, సింహనాదంతో ప్రయత్నం మొదలు పెట్టు, విజయం సాధించిన తర్వాత నిశ్శబ్దంగా ఉండు, నీ విజయాన్ని చూసి లోకమే హర్షధ్వానాలు చేయాలి.
అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, తలపొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, తలదించుకుని బ్రతికినవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది, నవ్వినవాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది.
అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది.
ఇతరులతో పోల్చుకోవడం అత్యంత వెర్రితనం, ప్రతి మనిషి అపూర్వము మరియు అసమానమైనవారు, ఏ క్షణమైతే నీవు ఇది అర్థం చేసుకుంటావో ఆ క్షణం నుండి నీలోని ఈర్ష్య కనుమరుగవుతుంది.
వేలెత్తి చూపించే వాడు ఎవడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు, అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు అది కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా,సంతోషమైనా నీ జీవితం నీది.
Telugu Life Quotes About Trust and Relationships
తెలుగులో బంధాలు మరియు నమ్మకాలు పై ప్రేరణాత్మక కోట్స్
నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు, అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు, ప్రతిక్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు.
తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు, చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, అర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది.
మన ముందు పొగడటం, మనం బాగుపడితే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మన వెనుక తిట్టడం, మనతో తియ్యగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు.
ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారోఅప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది.
తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో, చెడో బ్రతుకు నీది.కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీఇష్టం.
పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, ఆనందం అయినవాళ్ళు అందరితో పంచుకో,కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో.చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో, గతం చేసిన గాయాలు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో, మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో.
ఒకటి గుర్తుపెట్టుకో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
Inspiring Telugu Quotes on Life Lessons
జీవిత పాఠాలు తెలుగులో చెప్పే ప్రేరణాత్మక కోట్స్
ఖరీదైన వస్త్రము ధరించినా విడువక తప్పదు, ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు, ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు, ఎంత ఎత్తుకెళ్లినా తిరిగి నేలపైకి రాక తప్పదు, ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి సొంతగూటికి రాక తప్పదు, ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.
మనిషిలో అహం వీడిన రోజు,ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు, ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది, నేనే నాకేంటి అనుకుంటే మాత్రం, చివరికి ఒక్కడివే మిగిలిపోవాల్సి వస్తుంది. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి . గౌరవించాలి. గౌరవం పుచ్చుకోవాలి.
పని విలువ, పని చేసే వాడి విలువ, తెలియని చోట పని చేయడమంటే పనికిమాలిన తనం కాదు, ఆకలి తీరే ఇంకో దారి లేదని అర్థం.
చెడిపోవాలి అంటే నిన్ను ఏదీ ఆపదు, అదే బాగుపడాలి అంటే మాత్రం, ఎన్నో అడ్డంకులు వస్తాయి.వాటినన్నిటినీ ఎదుర్కొని నిలబడడమే గెలుపంటే.
చెప్పులు లేవని ఏడ్చేవాడికి, కాళ్లు లేనివాడు కనిపిస్తే గానీ అర్థం కాలేదట, వాడు ఎంత అదృష్టవంతుడోనని, మన అందరం అంతే, ఉన్న దాని గురించి సంతోష పడకుండా లేనిదాని కోసం ఏడుస్తూ ఉంటాం.
ఎప్పుడూ సముద్రగర్భంలో తిరిగే చేపలకు, తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు, అలాగే మన చుట్టూ ఉండే వారికి మనం దూరం అయ్యే వరకూ మన విలువేంటో తెలియదు.
కావాల్సిందెప్పుడు తేలిగ్గా దొరక్కపోవచ్చు, దొరికినా, అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా అది ఎక్కువ కాలం మన దగ్గర నిలవకపోవచ్చు, అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం.
చేతి రాతలో తప్పులుంటే సరి చేసుకోవచ్చు, కానీ,తలరాతలో తప్పులు ఉంటే మాత్రం కష్టమైనా, నష్టమైనా అనుభవించాల్సిందే.
చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకున్నా సంస్కారం ఉంటే ఎక్కడైనా ఎందులోనైనా పైకి వస్తావు.
Top Telugu Quotes on Life, Trust, and Relationshipsజీవితంపై, నమ్మకాలపై, మరియు బంధాలపై ప్రముఖ తెలుగులో కోట్స్
గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్ప గానే ఉంటుంది, ఓడిన వాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్త గానే ఉంటుంది, అందుకే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే ముందు గెలిచి మాట్లాడు.
ఎక్కడైతే తృప్తిగా ఉంటావో, అక్కడే గెలుస్తావు, ఎక్కడైతే తృప్తిని పొందలేవో, అక్కడ ఓడిపోతూనే ఉంటావు.గెలుపు, ఓటములు నీకు చుట్టాలు మాత్రమే, నీ శాటిస్ఫ్యాక్షన్ ఫీలింగే పర్మినెంట్.
కోల్పోయిన దాని గురించి కాదు, పొందాల్సిన దాని గురించి ఆలోచించు, గడిచిపోయిన దాని గురించి కాదు, చేరుకోవాల్సిన దాని గురించి ఆలోచించు.
అన్వేషించడం మొదలు పెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు,ఇష్టపడటం నేర్చుకో, ఈర్ష్య పడటం మానుకో, ఉన్నతంగా ఆలోచించు, ఊహాకు అందేలా ఆచరించు, ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు, ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు.
వందమంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి, నీ మంచిని కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు.చెడుని కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానీయకు, స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు.
అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా, నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు.నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది.
తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు, కానీ మోసం చేసిన వారికి ఎప్పటికి అవకాశం ఇవ్వకు, జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు.
అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికీ మనం సమాధానం చెప్పనక్కర్లేదు, అర్థంలేని మాటలకు బాధపడకూడదని మన మనసుకి చెప్పుకుంటే చాలు.
ఏ బంధంలోనైనా ఒక అడుగు మనము, ఒక అడుగు వాళ్లు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాం.