50+ Inspirational Life Quotes in Telugu for Motivation | జీవిత స్ఫూర్తి వాక్యాలు..
గతం గురించి ఆలోచించొద్దు కన్నీరొస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు భయం వేస్తుంది, చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు సంతోషం మీ సొంత అవుతుంది.
కెరీర్ కంటే ఏదీ ముఖ్యం కాదు, ఇవ్వాల్సిన సమయంలో దానికివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే మనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆటోమెటిక్గా ఇస్తుంది.
మన మాటలు మేకులై సూదులై ఇతరులను బాధించేవిగా ఉండకూడదు ఎదుటి వారి బాధల్ని భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చేవిగా ఉండాలి.
జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనమే కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది.
ఇతరుల సహాయం పొంది మనం గొప్పవాళ్లం కావొచ్చు కానీ, ఆ సాయం చేసిన వాళ్లను ఎప్పటికీ తక్కువగా చూడకూడదు.
మన వయసుని స్నేహితులతో లెక్కించాలి, సంవత్సరాలతో కాదు జీవితాన్ని సంతోషంతో లెక్కించాలి దుఃఖంతో కాదు.
తగిలిన గాయాలను కాలం మాన్పించలేదు కానీ, వాటిని మరచిపోయి ఎలా బతకాలో నేర్పిస్తుంది.
అదృష్టంపై ఆశ మనిషిని సోమరిని చేస్తుంది కష్టంపై ఆధారపడితే గొప్పవాడిని చేస్తుంది.
ఏం చేస్తే నలుగురికీ మంచి జరుగుతుందో తెలిసినా చేయలేకపోతున్నావంటే నీకు ధైర్యం లేదని అర్థం.
ఎవరినైనా తేలిగ్గా ఓడించవచ్చు కానీ, వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి.
జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే మన ఆలోచనలు ఇంతకు ముందు కంటే తెలివిగా పనిచేస్తాయి.
మనకు స్వీకరించే ధైర్యంఉన్నప్పుడు, ప్రతి తిరస్కరణ నూతన మార్గాన్ని చూపెడుతుంది ప్రతి విమర్శ మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది, అవమానం గెలవడానికి ప్రోత్సాహం ఇస్తుంది.
మనం సంపాదించే డబ్బుతో ఖరీదైన గడియారాన్ని కొనగలం కానీ, కాలాన్ని మాత్రం కొనలేము.
తాళిని బరువుగా బావించే ఏఆడది సంసారానికి పనికిరాదు, భార్యని బానిసగా బావించే ఏమగాడు సమాజానికి పనికిరాడు.
పరిగెత్తుదామన్న ప్రతిసారి ఎదోఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే, అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో, నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో.
మన ప్రార్థనలు సాధారణంగా ఆశీర్వాదం కోసం ఉండాలి, ఎందుకంటే మనకు ఏది మంచిదో దేవునికి బాగా తెలుసు.
ఒంటరిగా నడవటం అలవాటు చేసుకో, ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతోపాటు చివరిదాకా నడవలేకపోవచ్చు.
తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా, తులసి చెట్టునే పూజిస్తాం, అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా, గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం.
రోజులు మారాయి ఇదివరకటి రోజుల్లో ఒక మంచిపని చేస్తే పదిమంది మిత్రులు అయ్యేవాల్లు, ఈరోజుల్లో ఒక మంచి పనిచేస్తే పాతికమంది శత్రువులు తయారవుతున్నారు.
దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు, 100kg ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు, అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు.
ఇతరులను బాధపెట్టడం నీటిలో రాయివేసినంత సులువు, వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆరాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం, అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.
గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంత అయినా కాని, పెద్ద భారం అనిపించదు.
తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు.తన తప్పును సమర్థించుకొనేవాడు మూర్ఖుడు, ఇతరుల తప్పును వెల్లేతి చూసేవాడు అత్యంత మూర్కుడు, చేసిన తప్పును సరిదిద్దుకునవాడు ఉత్తముడు.
నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్న పిల్లవాడితో సమానం.
నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళు, విజయం నీ గురించి గర్జించి చెబుతుంది.
ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది. కానీ, ఒక మనస్సు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది.
అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా, వెలిగించేందుకు ఒక చేయి కావాలి, ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు కానీ, దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి, మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి.
మిమ్మల్ని మీరు ఎదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే, బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు.
డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు.
ఎక్కువ మరిగిస్తే నీళ్ళు కూడా ఆవిరైపోతాయి, అలాగే భరిస్తున్నారు కదా అని, బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి.
ఒక ఈక ఊడిందని ఎగిరేపక్షి ఆగిపోతుందా, అలాగే ఎవరో నీతి లేనివారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు.
తియ్యని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది, అలాగే అజ్ఞాని అరస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు.
ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతంకాదని, ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని ఒక హృదయం నవ్వుతూ చెప్పింది. అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని.
మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం పొందలేక పోవచ్చు. కానీ, ఏ పని చెయ్యకుండా మాత్రం ఆనందం పొందలేము.
అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే, కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశాంతి తక్కువే.
మధ్యతరగతి కుటుంబాలలో జీవితం అసలు బోరుకొట్టదు, ఎందుకంటే ఎప్పుడూ ఎదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది.
గొర్రె కసాయివాడ్ని నమ్ముతుందో లేదో తెలియదు కానీ, మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు.
చేసే ప్రతిపాపం అప్పులాంటిదే, ఎదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే, చేసే ప్రతిపుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది.
ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం, ఒడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే.
తగ్గి బ్రతుకు, కానీ తలదించుకుని బ్రతకవద్దు.
మనం చేసిన మంచిని మరుక్షణమే మరచిపోవాలి, మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి.
స్వయంకృషితో పైకి వచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు, నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపుకోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు.
పొగిడి నిన్ను పాడుచేసే వారికన్నా మీ మంచికోరి నిన్ను దండించేవారే మిన్న.
అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు.
ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే చెడ్డవాడు మంచివాడికంటే మంచిగా నటిస్తున్నాడు.
ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కటినంగా ఉంటాయి.
ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే, అది మనం సాధించాల్సినది అయినా అయ్యుండాలి, లేదా భాదించేది అయినా అయ్యుండాలి.
నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచేయి గీతలు కావు.
వందమందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ, ఒక్కరిని కూడా బాధపెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ల లక్షణం.
ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఒడిపోడు, ఒకసారి ఓపిక పట్టిచూడు నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతిబాధలో ఒక ఓదార్పు, భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది, విశ్వాసం కోల్పోరాదు.
Click for more..