Love and RelationShip Quotes in Telugu.. సంతోషకరమైన జీవితం కోసం ముఖ్యమైన సందేశాలు..
"నేను అనే భావనతో ఉండేవారు అందరూ ఉన్నా ఒంటరి వారే! మనం అనే భావన ఉన్న వారికి ప్రపంచమంతా ఓ కుటుంబమే"
"వాళ్లని కన్న వాళ్లను దూరంగా పెట్టి వాళ్లు కన్నవాళ్లతో సంతోషంగా గడుపుతూ రేపు అదే పరిస్థితి మనకు రాదనే విషయాన్ని మరచిపోతున్నారు కొందరు"
"మన మంచికోరే అమ్మ దండిస్తుంది మన బాగు కోరే తండ్రి మందలిస్తాడు మన భవిష్యత్తు కోరే భార్య పోరుపెట్టేది"
"భార్యాభర్తల బంధంలో ఇద్దరూ గొప్పవారే పురిటినొప్పులు ఓర్చుకుని బిడ్డకు జన్మనిచ్చిన భార్యతో పాటు కష్టనష్టాలు ఓర్చుకుని తన కుటుంబాన్ని పోషిస్తున్న భర్త కూడా గొప్పవాడే"
"మన జీవితంలో చిన్న కష్టం కూడా ఉండకపోయేది మన తలరాతరాసే అవకాశం తల్లిదండ్రులకు ఉంటే"
"ప్రతి ఒక్కరి జీవితంలో ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఒకరు జన్మనిచ్చిన తల్లి అయితే మరొకరు తాళి కట్టిన భార్య ఒకరు జన్మనిస్తే.. మరొకరు జీవితాంతం ప్రేమిస్తారు అమ్మ అంటే భారం కాదు భార్య అంటే బానిస కాదు"
"తన తనువును తాను మోసుకోలేని పరిస్థితిలో కూడా నిన్ను ప్రేమగా మోసేది అమ్మ మాత్రమే"
"పరీక్షల్లో ఫెయిలైతే మరోసారి రాసి పాసవ్వొచ్చు ప్రేమలో ఓడిపోతే మరొకరితో కొత్తజీవితం ప్రారంభించొచ్చు.. కానీ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దు"
Deep Love and RelationShip Quotation in Telugu
"కొందరి ఆలోచన.. కోడలు వేరు కాపురం పెడితే పెంపకం సరిగా లేనిది, సంస్కారం లేనిది.. అదే కూతురు వేరు కాపురం పెడితే చాలా తెలివైంది, సంసారాన్ని చక్కదిద్దుకునే నేర్పరితనం ఉన్నది"
"మనల్ని చూసే కళ్లు ఎన్నో ఉండొచ్చు.. కానీ, మనల్నే తలచుకుంటూ వాళ్ల కళ్లలో నింపుకుని ఎదురు చూసే వాళ్లు ఇద్దరే ఉంటారు వాళ్లే అమ్మా నాన్న"
నీ చేయిపట్టుకొని ఒక అమ్మాయి నీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకున్నప్పుడే ఇంట్లోవారు కూడా ఆమెకు ఆ గౌరవాన్ని, ప్రేమను పంచుతారు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు?
"తమ రక్తాన్ని స్వేదంగా మార్చి బిడ్డలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు"
"నాన్న చేతులు మురికిగా ఉండొచ్చు కానీ, ఆయన మనసెప్పుడూ మలిన మవ్వదు మన ముఖంలో సంతోషం చూడడానికి తన కన్నీళ్లు మనకెప్పుడూ కనబడనివ్వడు"
"గాంభీర్యం మాటున గొప్ప ప్రేమను చూపించటం తండ్రికి మాత్రమే సాధ్యం"
"కలిసి ఉన్నన్ని రోజులూ కొట్టుకుంటూనే ఉంటారు కానీ, దూరమైతే తట్టుకోలేరు చెల్లికి ప్రతి ఆలోచనలోనూ అన్నే కనిపిస్తాడు. చేసే ప్రతి పనిలోనూ అన్నకి చెల్లే కనిపిస్తుంది."
"ఇప్పుడు మీ తల్లితండ్రుల పట్ల మీరు నడుచుకునే తీరును బట్టే రేపు మీ పిల్లలు మీతో ఉంటారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి, వారికి దయనీయ పరిస్థితి రానీయకండి"
"అర్థం చేసుకోని మనిషికి వివరించడం వ్యర్థం మౌనంగా ఉన్నంత మాత్రాన మనం తప్పుచేసినట్లు కాదు అలా అని తప్పు ఒప్పుకున్నట్లు కాదు"
"ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు ఇంట్లో ఉన్నవాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం"