Best Heart Touching Love Quotes in Telugu
"స్త్రీకి ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటుంది అలా కాకుండా వేరే వాళ్లకు చెప్పుకుంటుంది అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు తన కష్టాన్ని చెప్పుకునే సమయం తనకు ఇవ్వడం లేదని"
"నిన్ను విడిచి వెళ్లిన వాళ్లు ఏ కారణం చేతనైనా తిరిగి రావొచ్చు కానీ, వారు నిన్ను ఎలా వదిలి వెళ్లారు అనేది మాత్రం మరచిపోవద్దు"
"అహం తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి, నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు ఆహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోలేరు"
"మనం సంపాదించే దాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది మనం ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది"
"పలకరింపులో ఆప్యాయత లేకపోయినా పర్వాలేదు కానీ, మనమే ప్రాణం అనుకుంటున్న వారిని అర్థం చేసుకోవడంలో రకం ఉండకూడదు నిర్లక్ష్యం"
"మనం కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, మన చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ల మనస్తత్వాలు బయట పడతాయి"
"మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు, ఎందుకంటే వాళ్లని మనం ప్రపంచం అనుకుంటాం కాబట్టి"
"కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి గాయం చేయడం మాత్రమే తెలుసు కొన్ని బంధాలు కూడా అంతే మనం ఎంత ప్రేమించినా వాటికి బాధపెట్టడమే తెలుసు"
"నువ్వు పరిచయం కాకముందు పగలే అందమైనదని అనుకునేవాడిని కానీ, నువ్వు కలలోకి వచ్చినప్పుడే తెలిసింది రాత్రి ఇంకా అందమైనదని"
"నిన్ను కన్నప్పుడు నీ తల్లి కన్నీరు పెట్టి ఉండొచ్చు కానీ, నిన్ను కన్నందుకు కంటతడి పెట్టే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోకు"
"బంధమైనా, బంధుత్వమైనా అది ఈ జన్మకే కావొచ్చు, ఎందుకంటే మరుజన్మ ఉంటుందో లేదో తెలియదు, అందుకే ఎవరినీ దూరం చేసుకోకండి"
"కళ్లకు నిద్రకరవైంది, రెప్పల మాటున దాగిఉన్న నీ జ్ఞాపకాలు మూతబడుతున్న కనురెప్పలను గుచ్చుతున్నాయి"
Love Quotation in Telugu
"నిన్ను చూసే వరకూ చూడలేదనే బాధ నువ్వు వచ్చాక వెళ్లిపోతావనే భయం ఎదురు చూపులు, అరకొర మాటలు ఏంటో ఈ తియ్యని బాధ బహుశా ప్రేమంటే ఇదేనేమో"
"జీవితంలో ఎవరి చెంతనైతే ఎక్కువ సంతోషంగా ఉంటామో వారితో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది వారి జ్ఞాపకాలతోనే ఎక్కువ జీవితం గడిచిపోతుంది"
"మన చుట్టూ ఉన్నవారిలో నటించే వారే ఎక్కువ ఉన్నారు ఎవరి స్వార్థాలు వారివి నటించే మనుషుల మధ్య మంచివాళ్లు ఒక ఆట వస్తువు మాత్రమే"
"జ్ఞాపకాలు అనేవి ఎప్పుడూ ప్రత్యేకమైనవే.. ఒక్కోసారి మనం బాధపడిన క్షణాలను తలచుకుని నవ్వుకునేలా చేస్తాయి ఒక్కోసారి మనం సంతోషంగా ఉన్న క్షణాలను గుర్తుచేసి బాధపెడతాయి"
"సంతోషం పంచుకుంటే పెరుగుతుంది బాధను పంచుకుంటే తగ్గుతుంది అని అందరూ అంటారు.. కానీ ఈ రోజుల్లో సంతోషాన్ని పంచుకుంటే కుళ్లుకుంటున్నారు బాధను చెప్పుకుంటే సంతోషపడుతున్నారు"
"కన్నీటిని తుడుచుకోవడానికి మన చేతి వేళ్లు చాలు ఆ బాధను మరిపించి పెదవులపై నవ్వులు పూయించేవాళ్లే మన వాళ్లు"
"ఉండిపోయే వాళ్లు కొందరు ఉండి పోయేవాళ్లు కొందరు ఈ రెండింటికీ మధ్య తేడా తెలుసుకున్నప్పుడే నీతో ఉండే మనుషులు ఎవరో అర్థం అవుతుంది"
"అవతలి వాళ్లకు అందంగా ఎప్పుడు కనిపిస్తామంటే కళ్లలో ఆత్మవిశ్వాసం పెదవులపై సత్యం ముఖంపై చిరునవ్వు గుండెల్లో ప్రేమ ఉన్నప్పుడు"
"మనం సంపాదించే దాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది మనం ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది"
"నువ్వు రెండక్షరాలు నేను రెండక్షరాలు మనం రెండక్షరాలు మన ప్రేమ రెండక్షరాలు నువ్వు, నేను ఏకమై మన రెండక్షరాల ప్రేమను మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంగా మార్చి వందేళ్ల జీవితంగా సాగిపోవాలని ఉంది"
"అవసరాలను బట్టి ఏర్పడిన బంధాలు తాత్కాలికం బంధం అనేది, ఎటువంటి అవసరాన్ని అయినా తీర్చేదిగా ఉండాలి"
"చెంపలపై జారుతూ కన్నీటి బొట్టు "మాట"ను అడిగిందట.. బాధలో ఉన్నప్పుడు నువ్వు బయటకు రాకుండా నన్నే ఎందుకు బయటకు పంపిస్తావని..? అప్పుడు "మాట" ఇలా చెప్పిందట "నువ్వు బయటకు వెళితే మనసు తేలిక అవుతుంది. అదే నేను పెదవిదాటితే అవతలి వారి మనసు గాయపడుతుంది"
Love and Life Quotations in Telugu
"పది మంది పిల్లలున్నా కష్టపడి అందర్నీ పెంచి పోషిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ,అదేం విచిత్రమో మరి.. ఆ పిల్లలు పెద్దయ్యాక పదిమందిలో ఒక్కరు కూడా ఆ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేపోతున్నారు"
"నా ఆనందంలో నవ్వు, నా ఊపిరిలో శ్వాస నువ్వు, నా గుండెల్లో చప్పుడు నువ్వు, నేను అనే పదానికి అర్థం నువ్వు, నా ప్రాణమే నువ్వు"
"నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి జ్ఞాపకం నువ్వే"
"నీ తలంపులు నా మదిలో గడియారపు ముల్లులా పరిగెడుతుంటే నిన్నెలా మరువగలను"
"మన తప్పులను మనల్ని ప్రేమించే వారి ముందు ఒప్పుకుంటాం క్షమిస్తారనే ధైర్యంతో కాదు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో"
"మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా కన్నీటితో నిన్ను కరిగించలేక నాతో నేను ఒంటరిగా ఉంటున్నా"
"కళ్లారా చూసుకుని తనివితీరా హత్తుకుని గుండెల్లో దాచుకోమంటోంది మనసు..కానీ.. నువ్వేమో జ్ఞాపకాల్లో నేనేమో నీ ఊహల్లో"
"క్షమాపణ కోరడమంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు అవతలివారు ఒప్పు చేసినట్టు కాదు నువ్వు బంధానికి ఎక్కువ విలువనిస్తావని అర్థం"
"కళ్లెదుట నిజం కనిపిస్తున్నా చెవులు విన్న అబద్ధాన్ని నమ్మి మన అనుకున్న వాళ్లను నిందించడమే అసలైన పిచ్చితనం"
Telugu Life Quotations
"నిజమే.. గుండెలపై మీకంటే గట్టిగా ఎవరు కొట్టలేరు కానీ.. మీరు గుండెల మీద ఎంత గట్టిగా కొట్టినా మిమ్మల్ని చివరి వరకు గుండెల్లో మోసేది మాత్రం మా అబ్బాయిలే"
"నీకోసం ప్రపంచాన్నే మరిచిపోయిన నన్ను నువ్వు మర్చిపోతావని అస్సలు ఊహించలేదు"
"నేను కోపంలో అన్న ఆ ఒక్క మాటను గుర్తుపెట్టుకున్న నువ్వు ప్రేమతో అన్న వంద మాటల్ని ఎలా మర్చిపోయావు"
"మూడు మూళ్ళ బంధానికి కట్టుబడి జీవితం అంత నిన్ను ప్రేమించేదే భార్య అలాంటి భార్యను ఆనంద పెట్టాకపోయిన పరవాలేదు కానీ బాధ పెట్టకండి"
"భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు బంధాన్ని గౌరవిస్తున్నామని అర్ధం"
"నటించడం రాని ప్రేమలో ఉండేవి.. కోపం,
అలకలు అర్థం చేసుకునే మనసుంటేనే వాటిలో ప్రేమ కనిపిస్తుంది"
"జీవితంలో బోలెడన్ని పరిచయాలు అవసరం లేదు,
ఉన్న పరిచయాల్లో జీవం ఉంటే చాలు"