Best Relationship Quotes In Telugu | తెలుగులో రిలేషన్షిప్ కోట్స్ : ప్రేమ, బంధం, వివాహం..
"బంధం అంటే, ఇద్దరు వ్యక్తులు.. ఒక గొడవ, మరెన్నో కలయికలు.. ఒక కోపం, మరెన్నో బుజ్జగింపులు.. ఒక అలక, మరెన్నో ప్రేమలు.. ఒక నమ్మకం, మొత్తంగా ఒకరికోసం ఒకరు"
నీకు తెలుసు నేను నీతో మాట్లాడకుండా ఉండలేను అని, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తాను అని, అయినా నీకు ఒకసారి కూడా అనిపించలేదా.....! కాల్ చేయాలని నాతో మాట్లాడాలని...!
"మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం, బంధాల విలువేంటో అర్థం కానివారికి మాటలేం అర్థమవుతాయి అని"
"కొన్ని బంధాలు అంతే చెప్పుకోనివ్వవు, తప్పుకోనివ్వవు, తెంచుకోనివ్వవు, పంచుకోనివ్వవు"
"కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం, ఎందుకో తెలుసా, బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి, కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు"
"నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారికి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే, అటువంటి వాళ్ళు ఎన్నేళ్ళ బంధాన్నైనా ఒక్కమాటతో తెంచేయగలరు"
"బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దల మాట, కానీ అర్ధం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్ధం చేసుకోని వారి గురించి ఏం లాభం వాళ దృష్టిలో మనం దిగజారడం తప్ప"
"బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువ లేనిది కాదు, భరిస్తే బలం అవుతుంది, అర్ధం చేసుకొనగలిగితే దాని విలువ పెరుగుతుంది"
"బంధమనేది మన ఎదుట నిజాయితీగా ఉండడంకాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం"
"ఎదుటి వ్యక్తి కి నీ పైన ప్రేమ లేనప్పుడు, నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది"
"దూరమైన బంధాలకు, దూరం చేసుకున్న బంధాలకు, చాలా తేడా ఉంది.. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా"
"కాలం కరిగిపోతోంది, సమయం జరిగిపోతోంది, వయసు అయిపోతుంది కానీ, మంచి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుంది.. బతికి ఉన్నన్నాళ్లు అలాంటి జ్ఞాపకాలను వీలైనన్ని ఎక్కువగా మూటగట్టుకుందాం"
"నిన్ను కన్నప్పుడు నీ తల్లి కన్నీరు పెట్టి ఉండొచ్చు కానీ.. నిన్ను కన్నందుకు కంటతడి పెట్టే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోకు"
"కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి గాయం చేయడం మాత్రమే తెలుసు, కొన్ని బంధాలు కూడా అంతే మనం ఎంత ప్రేమించినా వాటికి బాధపెట్టడమే తెలుసు"
"మనం కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, మన చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ల మనస్తత్వాలు బయట పడతాయి"
"మన అనుకున్న వాళ్లు తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది, ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది"
"ఎదుటి వాళ్ల వల్ల మనకు కష్టం కలుగుతున్నప్పుడు మన బాధను వాళ్లకు చెప్పాలి, దాచుకుంటే రోజూ బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది"
"ఎప్పుడూ కన్నవాళ్లు ఏం చేశారు, ఏం పెట్టారు అని ఆలోచించడం కంటే, అప్పుడప్పుడైనా వాళ్లకోసం మనం ఏం చేశామని ఆలోచిస్తే అర్థమవుతుంది, వాళ్లు ఎంత గొప్పవాళ్లు అనేది"
"మన సంతోషం తనకు కష్టం కలిగించినా, మన ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కునేది తల్లి మాత్రమే"
"బంధమైనా, బంధుత్వమైనా అది ఈ జన్మకే కావొచ్చు.. ఎందుకంటే మరుజన్మ ఉంటుందో లేదో తెలియదు..! అందుకే ఎవరినీ దూరం చేసుకోకండి"