Inspiring Life Quotes in Telugu.. తెలుగులో స్ఫూర్తిదాయకమైన జీవిత కోట్స్..
"తెలివితేటలు.. చెడ్డవారి దృష్టిలో తప్పు చేసి తప్పించుకోవడం మంచి వాళ్ల దృష్టిలో తప్పు చేయాల్సివచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం"
"ఈ రోజుల్లో.. అయిన వాళ్లకు అప్పు ఇచ్చి శత్రువు అవడం కంటే అడిగినప్పుడు లేదని చెడ్డవాళ్లుగా ఉండటమే మంచిదేమో"
Positive life Quotes In Telugu
"ఇనుము కంటే అగ్ని బలమైనది ఈజీగా కరిగించేయగలదు అగ్ని కంటే నీరు బలమైనది ఎంతటి మంటనైనా ఆర్పేయగలదు నీరు కంటే మనిషి బలమైనవాడు దానిని తాగేయగలడు మనిషి కంటే మృత్యువు బలమైనది ఎంతటి మనిషినైనా మాయం చేయగలదు"
"ఎత్తుకు తగ్గ బరువులేకపోవచ్చు కానీ, వయసుకు మించిన బాధ్యతలు మోసే ఉంటారు మధ్యతరగతి యువతలో ఎక్కువశాతం"
"చిన్నప్పుడు ఏ కారణం లేకపోయినా హాయిగా నవ్వుకునేవాళ్లం ఇప్పుడు కొన్ని బాధలను మరచిపోయేందుకు నవ్వాల్సివస్తోంది"
"చిల్లర ఖర్చులను తగ్గించుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది చిన్న మొత్తమే కదా అని నిర్లక్ష్యం చేస్తే మోయలేని భారమవుతుంది.. చిన్న రంధ్రం చాలదా.. ఎంత పెద్ద ఓడనైనా ముంచడానికి"
"చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని ప్రతిసారీ లక్ష్యాన్ని మార్చుకుంటూ పోతే ఎప్పటికీ సాధించలేము.. వీలైతే ప్రయత్నించే విధానాన్ని మార్చుకోవాలి"
"మధ్యతరగతి యువకుడి మదిలో.. జీవితమంతా మంచి ఉద్యోగం వెతుక్కోవడంలోనో.. నచ్చకపోయినా దొరికిన ఉద్యోగం చేసుకుంటూ బతికేయడంలోనో... వయసు అయిపోతుందని భయమేస్తుంది"
Short Life Quotes in Telugu
"మనం ఇబ్బంది పడేది రెండు సందర్భాల్లోనే మొదటిది డబ్బులు పొదుపు చేయలేనప్పుడు మరొకటి.. మాటలు అదుపు చేయలేనప్పుడు"
Life Lesson Quotes in Telugu
"కారణం లేని కోపం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం విలువ లేని బంధం నిరుపయోగం"