Good Morning Love Quotes in Telugu.. గుడ్ మార్నింగ్ లవ్ కోట్స్..
ఒకరు నిన్ను ప్రతిరోజూ పలకరిస్తూన్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా, వారి మనసులో మీ స్థానం చాలా ప్రత్యేకమైనది అని అర్థం, "శుభోదయం"
నీవు ప్రేమించే హృదయంలో ఏళ్ళ తరబడి బ్రతకడం కన్నా నిన్ను ప్రేమించే హృదయంలో కొంత కాలం ఉన్నా చాలు, "శుభోదయం"
నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు, ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని, "శుభోదయం"
నిద్రలేవగానే నిద్రపోయే ముందు నా కళ్ళు వెతికేది నీ మెస్సేజ్ కోసమే అది చూసిన వెంటనే నాకు కలిగిన ఆనందాన్ని కోట్లు పెట్టినా పొందలేను, "శుభోదయం"
చీటికి మాటికి గోడవపడి అలిగేవాళ్ళ మనస్సు చాలా స్వచ్చంగా ఉంటుంది. అర్ధం చేసుకో అద్భుతంగా ఉంటుంది. ఆ బంధం, "శుభోదయం"
ప్రేమతో ఇలా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెబితే వారి మనసులో జీవితాంతం నిలిచిపోతాం అంట నాకు నచ్చింది నువ్వేకదా అందుకే నీకు ప్రేమతో, "గుడ్ మార్నింగ్"
ఆనందంగా ఉండటం అంటే...డబ్బులు; ఆస్తులు; ఉండటం కాదు... ప్రతిరోజూ గుర్తు పెట్టుకోని ప్రేమగా తిన్నావా అనీ ఆప్యాయంగా పలకరించే మనుషులు ఉండటం గొప్ప, "శుభోదయం"
ధనం సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని, "శుభోదయం"
అప్పుడే కోప్పడి వెంటనే ఆ కోపాన్ని మరిచిపోయి మీ మీద ప్రేమను.. చూపించేవారు మీ జీవితం లో ఉంటే.. వారిని వదులుకోకండి.. ఎందుకంటే.. అలాంటివారి మనసులో.. నిజమైన ప్రేమ ఉంటుంది, "శుభోదయం"
మనిషికి ప్రశాంతత ఇచ్చేది, ప్రకృతే కావొచ్చు, కానీ.. మనసుకు ప్రశాంతత ఇచ్చేది.. మాత్రం మనసుకు నచ్చిన వారు.. ప్రేమగా మాట్లాడే మాటలు, "శుభోదయం"
ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది క్షణికమైన కోపం ఎందరినో శత్రువును చేస్తుంది, అందుకే విలువైన మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజునూ నవ్వుతూ ప్రారంభించండి, "శుభోదయం"
కొన్ని ఆనందాలు అనుభవించే సమయములో కన్నా మధుర జ్ఞాపకాలుగా మారిన తర్వాతే ఆ ఆనందాల విలువ తెలిసేది, "శుభోదయం"
నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది, "శుభోదయం"
అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది, పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది, అది బంధమయిన, వస్తువయిన, "శుభోదయం"
ఏమి చేసినా సమర్థించేవారు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవారు శ్రేయోభిలాషులు. మంచిని, చెడును రెండింటిని తెలియజేసేవారే నిజమైన స్నేహితులు, "శుభోదయం"
ఆప్యాయంగా పిలిచేవారు అభిమానంతో ఆరాధించే వారు చాలా తక్కువ ఉంటారు అటువంటి వారు మన దగ్గర నుండి ఏమి అశించరు తిరిగి ఓ పలకరింపు తప్పా, "శుభోదయం"
మనకు ఎన్ని పనులు ఉన్నా, ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని, పలకరించడం లో ఉండే ఆనందం, మాటల్లో చెప్పలేం, "శుభోదయం"
పుస్తకంలో రాసుకున్న జ్ఞాపకాలు కాల్చేస్తే కాలిపోతాయి, కానీ హృదయంలోని జ్ఞాపకాలు ప్రతి నిమిషం మనల్నే కాల్చేస్తాయి, "శుభోదయం"
ఇప్పటికి కొన్ని వేల సార్లు నీతో ప్రేమలో పడ్డాను, అలా ప్రతీరోజు ప్రతీసారీ నీతోనే ప్రేమలో పడుతూ నీతో హాయిగా జీవించాలి నా కోరిక కానీ ఈమధ్య నీ దూరం నాకు ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదు.. నీ కోపాన్ని నీ పంతాన్ని పక్కన పెట్టి నాతో ప్రేమగా వుండొచ్చుగా బుజ్జమ్మ, "శుభోదయం"
ప్రతి ఒక్కరి జీవితం లో ఒక విశేషమైన వ్యక్తి ఉంటారు తలరాత లో లేకపోయినా, వారి మనసులో ఆలోచనల్లో ఎప్పటికి ఉండిపోతారు, "శుభోదయం"
ఈ అందమైన పువ్వుల్లా కూడా ఎల్లప్పుడూ స్వచమైన చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ, "శుభోదయం"
మనం ప్రేమించే వారితో గడిపే గంటలు నిమిషాలకన్నా, మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి, "శుభోదయం"
ప్రేమ ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేనిస్తా, ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి, "శుభోదయం"
డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. మనసు లోనుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంతవరకు వెలుగుతూనే ఉంటుంది, "శుభోదయం"
సంతోషం అనేది... పది వేలు ఖర్చు పెట్టి, పది ఊర్లు తిరిగితే రాదు, మన అనుకునే వారితో పది నిమిషాలైనా... మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది, "శుభోదయం"
నీ చిరునవ్వు కన్నా అందమైనది ఏది లేదు ఈ ప్రపంచంలో... అందుకే నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటున్న నేస్తమా, "శుభోదయం"
మిమ్మల్ని సలహా అడిగినప్పుడు, సలహాతో పాటు మీ హస్తాన్ని కూడా అందించండి, ఎందుకంటే, సలహా తప్పు కావచ్చు, కానీ మీతోడు మాత్రం నిజమైనది, "శుభోదయం"